- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Railway News: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ డివిజన్ల పరిధిలో పలు రైళ్లు రద్దు
ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్, కాజీపేటన నుంచి బల్లర్ష రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు క్యాన్సిల్ అయ్యాయి. ఇక బల్లర్ష నుంచి కాజీపేట రైలు సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు, సిర్పూర్ టౌన్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి బోధన్ రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు, బోధన్ నుంచి కరీంనగర్ సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు, కాచిగూడ నుంచి నడికుడి, నడికుడి నుంచి కాచిగూడ రైళ్లు సెప్టెంబర్ 1-30 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం వెల్లడించారు. HS నాందేడ్ నుంచి రాయచూర్ ట్రైన్ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు, తాండూరు నుంచి రాయచూర్ తాత్కాలికంగా రద్దు అయ్యాయి. అదేవిధంగా భద్రాచలం రోడ్ నుంచి బల్లర్ష, సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రైళ్లకు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు కాజీపేటలో స్టాప్‌ను తీసివేశారు.






