గుడ్‌న్యూస్.. దసరా వేళ రద్దీకి చెక్.. వీపుపై స్కాన్ చేసి ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే వినూత్న ప్రయత్నం

by Ramesh Naini |

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ప్రయాణికుల రద్దీకి చెక్ పెట్టేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

గుడ్‌న్యూస్.. దసరా వేళ రద్దీకి చెక్.. వీపుపై స్కాన్ చేసి ట్రైన్ టికెట్ బుకింగ్.. రైల్వే వినూత్న ప్రయత్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: దసరా వేళ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. పండుగల సందర్భంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. టికెట్ల విషయంలో ఇటు ప్రయాణికులు, అటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలోనే రద్దీకి చెక్ పెట్టేలా రైల్వే శాఖ (Railway department) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిలబడి సమయం వృధా చేసుకోకుండా, (UTS Mobile App) యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్లు (Ticket booking) నేరుగా పొందే సౌకర్యం అందుబాటులో ఉందని రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

మొబైల్ ఫోన్‌ ద్వారానే టికెట్‌ను స్కాన్ చేసి ప్రయాణం కొనసాగించవచ్చని సూచించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో రైల్వే సిబ్బంది వీపున స్కానర్‌లు అమర్చుకుని.. స్కాన్ చేసి అన్ రిజర్వ్‌డ్ టికెట్లు తీసుకోవాలంటూ ప్రయాణికులకు వినూత్న అవగాహన కల్పిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. పండుగల రద్దీని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ డిజిటల్ సదుపాయాలను ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులను కోరింది.

Next Story