- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: మాజీ సీఎం కేసీఆర్‌పై రైల్‌రోకో కేసు.. పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో నమోదైన రైల్‌రోకో (Rail roko) కేసును కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్ (former CM KCR) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో నమోదైన రైల్‌రోకో (Rail roko) కేసును కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్ (former CM KCR) హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం రైల్ రోకో ఘటనలో కేసీఆర్ పిటిషన్‌పై (High Court) హైకోర్టులో విచారణ జరిగింది. 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో జరిగిన స్థలంలో కేసీఆర్ లేరని న్యాయవాది తెలిపారు. కేసీఆర్ పిలుపు మేరకే రైల్‌రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. రైల్‌రోకో ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌లో రైల్‌రోకో కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో కేసు నమోదు చేసి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ప్రజాప్రతినిధుల గతంలో 2024, జూన్ 25న స్టే విధించింది. దీంతో హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా తాజాగా విచారణకు వచ్చింది.






