దర్యాప్తు సంస్థల దాడులను లైవ్ టెలికాస్ట్ చేయాలి : సీపీఐ నారాయణ

by Disha Web Desk |
CPI Narayana Takes his Words Back Over Megastar Chiranjeevi
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు చేస్తున్న సోదాలను లైవ్ టెలికాస్ట్ పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎక్కడ దాడులు చేసినా అధికారులు.. రైడ్స్‌కు సంబంధంచి లైవ్ పెట్టాలని అన్నారు. లైవ్ టెలికాస్ట్ ద్వారా లోపల ఏం జరుగుతుంది.. అధికారులు ఏం చేస్తున్నారో తెలిసిపోతుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడులు రాజకీయ కక్ష్యతోని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరుగుతున్నాయని అన్నారు. బీజేపీని వ్యతిరేకించేటటువంటి రాజకీయ పార్టీలపైన, వ్యాపార సంస్థలపైన దాడులు చేస్తున్నారని విమర్శించారు. రైడ్స్‌లో ఏం జరిగిందో చెప్పకుండా.. ఢిల్లీ వచ్చి మాట్లాడుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఈడీ ఎక్కడ దాడులు చేసినా వాళ్ల వద్ద ఉన్న కెమెరాలతో లైవ్ పెట్టాలన్నారు. అలా చేస్తే లోపల ఏమి జరుగుతోందో? అందరికీ తెలుస్తుందని... అక్రమాలన్నీ బయటపడతాయని నారాయణ పేర్కొన్నారు. ఒకవేళ దీనిని లైవ్ టెలికాస్ట్ చేయకపోతే కేవలం కక్ష్య సాధింపు చర్య అనే చెప్పా్ల్సి వస్తుందని నారాయణ అన్నారు.

Next Story