ఒకే కారులో రాహుల్, రేవంత్, టీపీసీసీ చీఫ్.. ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి

by Kema Shiva Kumar |

లియోనెల్ మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతలు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

ఒకే కారులో రాహుల్, రేవంత్, టీపీసీసీ చీఫ్.. ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: లియోనెల్ మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతలు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాహుల్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్‌ కుమార్ గౌడ్ ఓకే కారులో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను సీఎం, పీసీసీ చీఫ్ రాహుల్‌కు వివరించారు. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తీరు, గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించిన విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ పనితీరుపై రాహుల్‌గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారని నేతలు తెలిపారు.

ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి..

ఓటుచోరీ అంశంపై ఢిల్లీలో నేడు జరిగే నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్‌ గాంధీతో పాటు ఆయన ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story