తెలంగాణ పాలిటిక్స్‌లో ‘జాతిర‌త్నం’.. పండుగపూట నెట్టింట రచ్చ!

by Gantepaka Srikanth |

అర్జున్ రెడ్డి, జాతిర‌త్నాలు సినిమాలతో ఫేమస్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ పాలిటిక్స్‌లో ‘జాతిర‌త్నం’.. పండుగపూట నెట్టింట రచ్చ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జున్ రెడ్డి, జాతిర‌త్నాలు సినిమాలతో ఫేమస్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉండే ఆయన దసరా పండగ నాడు వరుసగా ట్వీట్లతో రచ్చ చేశారు. మొన్న ఎక్స్ వేదికగా హల్‌చల్ చేసిన రాహుల్.. తాజాగా ఆయన ఎక్స్ ఖాతా కనిపించకుండా పోయింది. అకౌంట్ ఓపెన్ కాకపోవడంతో ఏమై ఉంటుందా..? అని సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన చేసిన ట్వీట్‌లు వివాదాస్పదంగా మారడంతో పూర్తిగా డిలీట్ చేశారా..? డీయాక్టివేట్ చేశారా..? ఎవరైనా రిపోర్ట్‌లు కొట్టారా? అని తెలియాల్సి ఉంది. ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే వెళ్లిపోతా మామ’ అన్నట్లుగా జాతి రత్నాలు సినిమాలో ఫేమస్ డైలాగ్ మాదిరి వరసగా వేసిన ట్వీట్‌లతో ప్రాబ్లమ్ అవ్వడంతో ఖాతా డీయాక్టివేట్ చేసుకొని వెళ్లిపోయినట్లు ఎక్స్ వేదికగా హాట్‌టాపిక్‌గా మారింది. ‘హైదరాబాద్ మళ్లీ మునిగింది. హామీలన్నీ విఫలమయ్యాయి. పరిస్థితులు అన్ని చక్కబెట్టేందుకు కేసీఆర్ మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారు.’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదు.’ అంటూ మరో ట్వీట్ చేశారు. మరో ట్వీట్‍లో మనము ఎంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నామో! డబుల్‌డోర్ తిరిగి వచ్చే రోజు కోసం ఎదురుచూడలేకపోతున్నాను. అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. వెళ్లి నన్ను చంపేయండి. ఇప్పటికే విసిగిపోయాను. బోలెడంత అలసిపోయాను.’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రాహుల్ రామకృష్ణ ట్వీట్లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కాగా, ఈ ట్వీట్లను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాటికి కాంగ్రెస్ మద్దతుదారులు కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో దసరా పూట మందు ఎక్కువైందా? ప్రభుత్వం నీకేం తక్కువ చేసింది అంటూ నెటిజన్‌లు కామెంట్ పెట్టారు. మరోవైపు రాహుల్ ట్విట్టర్ ఖాతా డీయాక్టివేట్ చేసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బెదిరింపుల వల్లే ఆయన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారని నెట్టింట చర్చ జరుగుతోంది.

Next Story