- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: కాంగ్రెస్‍లో గ్రూప్ తగాదాలు.. సొంత నేతలపై రాహుల్ ఫైర్
కాంగ్రెస్‍లో గ్రూపు తగాదాలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కంటే ఏ నాయకుడు గొప్ప కాదన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సీరియస్ అయ్యారు. ఇక పద్దతి మార్చుకోవాలని, లేకుంటే మల్లికార్జున ఖర్గే నేను కలిసి మిమ్మల్ని సెట్ రైట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకనైనా టీమ్‍గా పని చేయాలని లేదంటే మిమ్మల్ని రిజర్వ్ లో ఉంచుతానని స్ట్రాంగ్ వార్నింగ్ (Rahul Gandhi Warning) ఇచ్చారు. శనివారం పంజాబ్‍లోని బర్నాలా జరిగిన బహిరంగ సభలో సొంత పార్టీ నేతలపై రాహుల్ గాంధీ చేసిన సీరియస్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్‍గా మారాయి.
పార్టీ కంటే ఎవరు పెద్ద కాదు:
ఈ మీటింగ్‍లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి (Congress Party) కూడా ఒక సందేశం పంపాలనుకుంటున్నాను.. నేతలు తమ మధ్య నెలకొన్న విభేదాలు పక్కన పెట్టండి. పార్టీ కంటే ఏ నాయకుడు గొప్ప కాదు. టీమ్ వర్క్ ఉంటేనే పని జరుగుతుంది. ఒక ప్లేయర్ బాగా ఆడితేనే మ్యాచ్ గెలవలేము. మన దగ్గర పూర్తి టీమ్ ఉంది. అందరూ సమిష్టిగా ఉండండి. లేదా మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అది మీరు ఎంత పెద్ద వారైనా సరే. మా నిజమైన బలం పార్టీ కార్యకర్తలే అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే వచ్చే ఏడాది పంజాబ్‍లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడి నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. అలాగే త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మరో వైపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించడం రాహుల్ గాంధీ నేతృత్వంపై చర్చ జరుగుతోంది. ఇటువంటి తరుణంలో సొంత పార్టీ నేతలపై చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పార్టీలో బీజేపీ కోవర్టులు:
దాదాపు ఏడాది క్రితం గుజరాత్‍లో కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో సొంత నేతలపై రాహుల్ గాంధీ ఇదే తరహాలో విరుచుకుపడ్డారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ టీమ్‍గా పని చేస్తున్నారని అలాంటి వారిని సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‍లో నేతలకు కొదువలేదని, బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్న వారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తామన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సొంత పార్టీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేయడం హస్తం పార్టీలో చర్చనీయాశంగా మారింది.






