- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సారీతో స్టార్ట్ చేసిన రాహుల్.. భారత్ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ(HICC) వేదికగా జరుగుతోన్న భారత్ సమ్మిట్- 2025 సదస్సు(Bharat Summit)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ(HICC) వేదికగా జరుగుతోన్న భారత్ సమ్మిట్- 2025 సదస్సు(Bharat Summit)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్‌కు తాను నిన్ననే రావాల్సి ఉండే.. కానీ, కశ్మీర్‌కు వెళ్లాను.. క్షమించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని అన్నారు. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదని అన్నారు.
ఇక్కడే కాదు.. విపక్ష పార్టీలు ప్రపంచ వ్యాప్తంగా అణిచివేతకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు. విపక్షాల వాదన వినేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందారు. దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని.. ఇప్పుడా సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గాలు వెతుక్కుంటున్నారని అన్నారు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు. విద్వేశ రాజకీయాలు చేయకుండా.. ప్రజలకు ప్రేమను పంచాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)తో దేశం మొత్తం తిరిగానని.. ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అన్నారు. దేశ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపించారని తెలిపారు.
‘భారత్ జోడో యాత్రలో 4వేల కిలోమీటర్లు నడిచా.. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలుపెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలోలా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు.. కానీ, యాత్రలో నేను ప్రజలపై నా ప్రేమను వ్యక్త పరచగలిగాను.. నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపరిచానో అప్పట్నుంచి అందరూ స్పందిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.






