- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంలో రాహుల్ గాంధీ కుట్రలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశ వ్యతిరేక రాజకీయాలు చేస్తూ.. దేశ పురోగతిని వెనక్కి లాగేందుకు రాహుల్ గాంధీ కుట్రలు పన్నుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు. అన్నదాతల విషయంలో అన్యాయంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలన్నారు.

- రైతులు, ఎగుమతి దారుల్లో ఆందోళనలు కలిగించేలా ఎత్తులు
- వారి బూటకపు మాటలను దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
దిశ, తెలంగాణ బ్యూరో : భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రైతులు, ఎగుమతిదారుల్లో భయాందోళనలు కలిగించే కుటిల ప్రయత్నమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. వ్యతిరేక రాజకీయాల ద్వారా దేశ పురోగతిని వెనక్కు లాగేందుకు కుట్రలు పన్నుతున్నారుని ఆయన దుష్ప్రచారాన్ని ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ప్రస్తుతం భారత్ రూ.4 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. 38 అభివృద్ధి చెందిన దేశాల పరిధిలోని 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ద్వారా రూ. 45 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్స్ పార్కులను అభివృద్ధి చేస్తోందని అందులో ఒకటి వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పేరుతో డెవలప్ అవుతోందన్నారు. మరోవైపు పత్తి డిమాండ్ తగ్గుతుందని రైతులను భయపెట్టేందుకు, ఆందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారత వస్త్ర పరిశ్రమ రంగంలో విస్తారమైన వృద్ధి అవకాశాలు ఉన్నందున భారత పత్తికి డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. దీని ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్నదాతల విషయంలో అన్యాయంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ రైతు సంఘం సిఫారసులను అమలు చేసే ప్రసక్తే లేదని 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని స్వామినాథన్ కమిటీ సూచించింది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదు. తరువాత ఏర్పడిన మోడీ ప్రభుత్వం ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంఎస్పీ విధానాన్ని అమలు చేసింది. రైతుకు అయ్యే ఉత్పత్తి వ్యయానికి రెట్టింపు ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. ఇప్పటివరకు వరుసగా 100 ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత రాహుల్ గాంధీ నిరాశ, నిస్పృహలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడీపై ఉన్న వ్యతిరేకతను దేశంపై వ్యతిరేకతగా మలచుకున్నారు. అందుకే 11 ఏళ్లుగా దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, అధికారం దక్కదన్న అసహనంతో దేశంలో అన్నదాతలను, ఎగుమతిదారులను రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారని వీటిని ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు.






