Rohith Vemula Act: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ లేఖ

by Ramesh Naini |

తెలంగాణలో ‘రోహిత్ వేముల’ (Rohith Vemula Act) చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు.

Rohith Vemula Act: తెలంగాణలో రోహిత్ వేముల చట్టం.. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ‘రోహిత్ వేముల’ (Rohith Vemula Act) చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ లేఖలో కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు.

ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీ లేఖను విడుదల చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి లేఖ రాసిన తర్వాత, తను హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘రోహిత్ వేముల చట్టం’ అమలు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇక, రోహిత్ వేముల చట్టంపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ స్పందించారు. రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారని, రోహిత్ చట్టం పై సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కాగా, 2016లో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న రోహిత్ వేముల కుల వివ‌క్ష కారణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే.

Next Story