HYD: ఆటోలో రాహుల్ గాంధీ చక్కర్లు.. (వీడియో)

by Sathputhe Rajesh |

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఆటోలో పలు ప్రదేశాలు తిరిగారు.

HYD: ఆటోలో రాహుల్ గాంధీ చక్కర్లు.. (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఆటోలో పలు ప్రదేశాలు తిరిగారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లో ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులతో ఆయన ఇంటరాక్షన్ అయ్యారు. ఆ సమయంలో తనను ఆటోలో సిటీ తిప్పాలని ఓ ఆటో డ్రైవర్‌కు రాహుల్ కోరారు. సమావేశం ముగియగానే రాహుల్‌గాంధీ నాంపల్లి ఎన్నికల ప్రచార రోడ్ షోకు హజరవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సిటీలో కొద్ది సేపు ఆటోలో కూర్చుని చక్కర్లు కొట్టారు. ఆ సమయంలో రాహుల్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story