రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మౌనదీక్ష

by Disha Web Desk 9 |
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మౌనదీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మౌన దీక్షకు దిగారు. ఈ దీక్షలో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, నిరంజన్, ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు రోహిన్ రెడ్డి, వినోద్ రెడ్డి, అనుబంధ సంఘాల ఛైర్మన్‌లు, నాయకులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ 2019 లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌లో చేసిన ప్రసంగంలో మోడీని అవమానించారని పరువు నష్టం దావా వేశారు. ఇవాళ సూరత్ కోర్టు ఆ కేసులో రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు మోడీ నేతృత్వంలో ఇలాంటి కేసులు నమోదు చేసి గొంతు నొక్కే ప్రయత్నాలను నిరసిస్తూ మౌన దీక్షకు దిగారు.

ఇవి కూడా చదవండి : స్వరం మార్చిన కేసీఆర్.. ఎలక్షన్ ఇయర్‌లో సడెన్‌గా కొత్త రాగం!

Next Story

Most Viewed