అలా జరిగితేనే.. హిందూ వివాహం చెల్లుబాటు : సుప్రీంకోర్టు

by Dishanational4 |
అలా జరిగితేనే.. హిందూ వివాహం చెల్లుబాటు : సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే.. దాన్ని తగిన ఆచారాలు, వేడుకతో నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సప్తపది (పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడు అడుగులు) వంటి ఆచారాలు వివాదాల సమయంలో రుజువుగా అవసరమని న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మహిహ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆచారం ప్రకారం వివాహ వేడుకలు జరగకుండానే ఇద్దరు పైలెట్ల జంట విడాకులు కోరిన కేసులో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఈ కేసులో వారి విడాకుల ప్రక్రియను.. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై నమోదైన కట్నం కేసును కూడా న్యాయస్థానం రద్దు చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. వివాహ వేడుక చెల్లుబాటు కావాలంటే అది ఆచారం ప్రకారం జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. హిందూ వివాహం అనేది పవిత్రమైన మతకర్మ అని పేర్కొంది. వివాహం అనేది పాటలు-డ్యాన్స్, భోజనం వంటి వాటి కోసం జరిగే కార్యక్రమం కాదని కోర్టు స్పష్టం చేసింది.

Next Story