రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదు..కాంగ్రెస్ ఆరోపణలపై అమిత్ షా కౌంటర్

by Dishanational6 |
రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదు..కాంగ్రెస్ ఆరోపణలపై అమిత్ షా కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. తమ పార్టీకి రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చండీగఢ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే అరోపణలపై స్పందించారు.

అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడమే కాంగ్రెస్ ఫార్ములా అని హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు. మోడీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. తన ఫేక్ వీడియోను సర్క్యూలేట్ చేశారని గుర్తుచేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏరోజూ.. రిజర్వేషన్ల తొలగింపు గురించి మాట్లాడలేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనీయం అని స్పష్టం చేశారు అమిత్ షా.

Next Story