రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే.. కాంగ్రెస్ నేతల భాషపై బండి సంజయ్ ఫైర్

by Ramesh Goud |

హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే.. కాంగ్రెస్ నేతల భాషపై బండి సంజయ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను చార్జిషీట్ లలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఈడీ, సీబీఐ లను రాజకీయ కక్ష్యల కోసమే వాడుకుంటుందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్.. ఈడీ ఆఫీస్ (ED Office) వద్ద కాంగ్రెస్ నేతలు (Congress Leaders) మాట్లాడింది వారి అభిప్రాయాలు కాదని, రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాసిచ్చిన స్క్రిప్ట్ (Script) నే వారు చదివారని మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy)లపై కాంగ్రెస్ నేతలు వాడిన దుర్భాష కేవలం అవమానరమైనది మాత్రమే కాదని, ప్రజలు సైతం ఉలిక్కి పడే భాషను వాడారని అన్నారు. ఇది రాజకీయ దివాళా కోరుతనంతో చేసిన అవమానకరమైన ప్రవర్తన అని ఫైర్ అయ్యారు.

ఈ స్థాయి ప్రవర్తనను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందని, దీనిపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. ఇక దేశ ప్రజలంతా ఛీత్కరించుకుంటున్నారన్న నిరాశనో.. లేక దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోయామన్న పేరాశనో అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేగాక వివేకం, వ్యక్తిత్వం అన్నీ వదిలేసి ప్రధాని స్థాయిని మర్చిపోయి, మీ హుందాతనాన్ని కాపాడుకోలేక దిగజారుడు వ్యాఖ్యలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల భాషను చూస్తే 2029 కాదు, యుగం గడిచినా మీ పార్టీ బతుకు అగమ్యగోచరమేనని కేంద్రమంత్రి అన్నారు.

Next Story