- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు.

దిశ, హిమాయత్ నగర్ : రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని ప్రముఖ రచయిత రచించిన దొమ్మట వెంకటేష్ “హోప్ ది నేషన్” జాతీయ ఓబీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరం, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ రచించిన కులగణనకు సంబంధించిన డేటా ను మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ 2029 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని తెలిపారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై బీజేపీ కి ప్రేమ లేదని విమర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జన్మదిన పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.






