అరెస్టులకు రాహుల్‌గాంధీ భయపడే వ్యక్తి కాదు.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి

by Kema Shiva Kumar |

అరెస్టులకు భయపడే వ్యక్తి రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కాదని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి (MLA Megha Reddy అన్నారు.

అరెస్టులకు రాహుల్‌గాంధీ భయపడే వ్యక్తి కాదు.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అరెస్టులకు భయపడే వ్యక్తి రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కాదని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి (MLA Megha Reddy అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రంలో బీజేపీ నేతలు మద్దతు తెలిపి.. కేంద్రంలో మొండిచేయి చూపారని ఆరోపించారు. బీజేపీ ముమ్మాటికీ బీసీ వ్యతిరేక పార్టీ అని కామెంట్ చేశారు. తమ అధినేత రాహుల్ గాంధీ అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని.. ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడైనా ముందు ఉండే వ్యక్తి అని అన్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబ్, నితీశ్ కుమార్ దయతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని పీఠమెక్కడం ఖాయమని మెఘా రెడ్డి జోస్యం చెప్పారు.

Next Story