- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చంపేట గురుకులంలో ర్యాగింగ్ భూతం..!
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది.

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులు తాము చెప్పిన పనులు చేయలేదన్న కారణంతో సీనియర్ విద్యార్థులు వారిని గదిలో బంధించి దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు కలుసుకునేందుకు వచ్చిన సందర్భంగా 6, 7, 8 తరగతి చెందిన విద్యార్థులు బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బందిని నిలదీశారు.
సీనియర్ విద్యార్థులంతా తమ పిల్లలను ఇంతగా చితకబాదినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. స్వేచ్ఛగా చదువుకునే అవకాశం కూడా కల్పించకపోతే ఎలా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ వెల్ఫేర్ ఆర్సీవో వనజ సోమవారం గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ ప్రారంభించారు.






