తెలుగు రాష్ట్రాల్లో జగన్ రికార్డు బద్దలు కొట్టిన రఘువీర్ రెడ్డి!

by Ramesh Goud |

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నల్లగొండ అభ్యర్ధి అత్యధిక మెజారిటీ సాధించి, తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డు నమోదు చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జగన్ రికార్డు బద్దలు కొట్టిన రఘువీర్ రెడ్డి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నల్లగొండ అభ్యర్ధి అత్యధిక మెజారిటీ సాధించి, తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డు నమోదు చేసుకున్నారు. గతంలో జగన్ పేరుపై ఉన్న ఈ రికార్డును ఇప్పడు రఘువీర్ రెడ్డి బీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి దాదాపు 5.51 లక్షలకు పైగా మెజారిటీ సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ మెజారిటీ సాధించిన వ్యక్తిగా రికార్డు తన ఖతాలో వేసుకున్నారు.

2011లో జగన్ కడప లోక్ సభ ఉప ఎన్నికల్లో భాగంగా 5.43 లక్షల మెజారిటీ సాధించి, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీగా రికార్డు తన పేరుపై నమోదు చేసుకోగా.. ఈ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదిలా ఉండగా ఈ రికార్డులు నమోదు చేసిన ఇద్దరు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుల వారసులే కావడం గమనార్హం. ఒకరు మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కాగా.. మరోకరు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు. అంతేగాక నల్లగొండ పార్లమెంట్ స్థానంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యదిక మెజారిటీ సాధించింది కూడా రఘువీర్ రెడ్డే కావడం విశేషం. 1952 లో నల్గొండ పార్లమెంట్ నుంచి కమ్యూనిస్టు అభ్యర్థి రావి నారాయణరెడ్డి 3,09,162 ఓట్లు ఆధిక్యత సాధించగా.. నేడు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5.51 లక్షల మెజారిటీతో ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

Next Story