కేటీఆర్‌కు అప్పుడు ప్ర‌కృతి గుర్తు రాలేదా? రఘునందన్ రావు చుర‌క‌లు!

by Ajay Maddhiboyina |

111జీవో ర‌ద్దు చేసిన‌ప్పుడు కేటీఆర్‌కు ప్రకృతి గుర్తు రాలేదా అని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ప్ర‌శ్నించారు.

కేటీఆర్‌కు అప్పుడు ప్ర‌కృతి గుర్తు రాలేదా? రఘునందన్ రావు చుర‌క‌లు!
X

దిశ, వెబ్ డెస్క్: 111జీవో ర‌ద్దు చేసిన‌ప్పుడు కేటీఆర్‌కు ప్రకృతి గుర్తు రాలేదా అని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ప్ర‌శ్నించారు. కేటీఆర్ కు ఇప్పుడు జ్ఞానోద‌యం అయ్యిందా అని అడిగారు. మీడియా స‌మావేశంలో ర‌ఘునంద‌న్ రావు మాట్లాడుతూ.. ల‌క్షల ఎక‌రాల్లో 111 జీవో ప‌రిధిలో ఫార్మ్ హౌస్‌లు కట్టుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వ పెద్దలు ఎలా అనుమిచ్చారని అన్నారు. 111 జీవో పరిధిలో కేటీఆర్, హరీష్ రావు ఫార్మ్ హౌస్‌లు లేవా అని ప్రశ్నించారు. ఆ భూములు యూనివర్సిటీకి చెందాలని బీజేపీ ఎంపీలుగా తాము పోరాటం చేసినట్టు తెలిపారు.

హెచ్‌సీయూ భూముల గురించి మాట్లాడిన తరవాత కూడా కేటీఆర్ చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధాంతాలు ఒకటే అని విమర్శించారు. రెండు పార్టీలు ఎంఐఎంకు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. మోడీ పేరు ఎత్తకుండా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని తాము కేటీఆర్ గురించి మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ పక్కన హై రైస్ బిల్డింగులకు కేటీఆర్ ఎలా అనుమతించారని నిలదీశారు. పర్యావరణం గురించి మాట్లాడేత హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపిస్తున్నారని, మరి ఆ పేరు ఎందుకు బయట పెట్టడంలేదని నిలదీశారు.

Next Story