Raghunandan Rao: కవిత చెప్పిన దాంట్లో అదొక్కటే కొత్త విషయం: రఘునందన్ రావు

by Prasad Jukanti |

కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.

Raghunandan Rao: కవిత చెప్పిన దాంట్లో అదొక్కటే కొత్త విషయం: రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్తగా ఏమీ చెప్పలేదని చాలా కాలంగా తాము చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె చెప్పారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్ కు చెప్పానని అయినా ఆ రోజు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకటే ఫ్లైట్ లో వచ్చారనే విషయం వాళ్లిద్దరు కుమ్మక్కై మెదక్ లో నన్ను ఓడించాలని చూస్తున్నారనే విషయాన్ని 22 మార్చి 2024 లోనే తాను మీడియా ముందుకు వచ్చి చెప్పానన్నారు. 20 మార్చి 2024 ఏయిరిండిలా విమానంలోని బిజినెస్ క్లాస్ లో రేవంత్ రెడ్డి, హరీశ్ రావు (Harish Rao) కలిసి ట్రావెల్ చేశారని నన్ను ఓడించేందుకు చర్చించుకున్నారన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవినీతిని పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కవిత మాటలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా అవినీతి పునాదుల మీద విస్తరిచబడిందనేది అర్థమవుతోందన్నారు.

కేసీఆర్ క్లబ్ లు బంద్ చేస్తే మీరు పబ్బులు నడిపిన విషయం అందరికి తెలిసిందే 'టానిక్' అంశం చిన్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని రూ. 750 కోట్లతో ఎమ్మెల్సీ పోచంపల్లి విల్లా కడుతుంటే, మరో ఎమ్మెల్సీ నవీన్ రావు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కవిత ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని రాబోయే ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ పెద్దలు చేసిన అవినీతిని కవిత బయటపెడితే బాగుటుందన్నారు. సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే కవిత ఆలోచనను తప్పు పట్టడం లేదు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సొంత నేతల అవినీతిపై ఎందుకు మాట్లాడలేదన్నారు. బొల్లారం. పటాన్ చెరు, ఆదిబట్ల, బాలానగర్ భూముల కన్వర్జేషన్ విషయంలో కవిత మాట్లాడతారని భావించాం కానీ మాట్లాడలేదన్నారు. మేము మాట్లాడితే కక్ష సాధింపు అంటారు కాబట్టే కవితనే మాట్లాడాలన్నారు.

కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వయిరీ చేయాలన్నారు. హరీశ్ రావు పాల వ్యాపారంపై అయోధ్యరెడ్డి చేసిన ట్వీట్ పై ఆయన స్పందించాలన్నారు. బీఆర్ఎస్ నేతలపై బరుద వేసి కవిత వెళ్లాలని అనుకుంటున్నారేమో కానీ ఇవన్నీ మేము ఇదివరకు మాట్లాడిన విషయాలేనన్నారు. కవిత చెప్పనట్లు మోకిలాలో ఎమ్మెల్సీ పోచంపల్లి చేస్తున్న ప్రాజెక్టులు, మరో ఎమ్మెల్సీ నవీన్ రావు అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏసీబీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అందరి గురించి మాట్లాడుతున్న కవిత ఓ వ్యక్తిని మర్చిపోయారని రఘునందన్ రావు అన్నారు. సంతోష్ రావుకు బంధువు డీసీపీ సందీప్ రావు ను పెట్టుకుని దుబ్బాక ఉప ఎన్నికల్లో మమ్మల్ని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. సందీప్ రావు పోలీసులలో సూపర్ మ్యాన్ అని, ఫోన్ ట్యాపింగ్, డబ్బులు పట్టుకోవడంలో ఈయనది కీలక పాత్ర అన్నారు. ఈయన పేరును ఎవరు పట్టించుకోవడం లేదు కానీ నార్సింగి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉంటూ వీరి నాయకత్వంలో నా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నానాయాగి చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వ్యవహారంపై మాట్లాడుతారని ఆశించామన్నారు.

Next Story