Raghunandan Rao: సుప్రీంకోర్టు తీర్పుపై రఘునందన్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasad Jukanti |

సుప్రీంకోర్టు తీర్పుపై రఘునందన్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Raghunandan Rao: సుప్రీంకోర్టు తీర్పుపై రఘునందన్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court verdict) ఇచ్చిన తీర్పును మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్వాగతించారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు 3 నెలల వ్యవధిలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు నెలల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనేది తీర్పులో చెప్పలేదన్నారు. ఒక వేళ నిర్ణయం తీసుకోకపోతే ఇది కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఓ సంఘర్షణగా చూడాల్సి వస్తుందనే విషయాన్ని స్పీకర్, కోర్టులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదేరోజు మాలేగావ్ (Malegaon Blast Case) పేలుడు కేసులో ముంబయి ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సైతం బీజేపీ స్వాగతిస్తోందన్నారు. యూపీఏ-1 ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఈ దేశంలో కొత్త చరిత్ర సృష్టించాలని ప్రయత్నం చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆధారాలు లేకున్నా ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారని ఆరోపించారు. నాటి అధికారులు చేసిన దుర్మార్గపు ప్రయత్నాన్ని కోర్టు కొట్టివేసిందన్నారు. ఈదేశంలోని హిందువులను టెర్రరిస్టులుగా చూపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని రఘునందన్ రావు ఆరోపించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాషాయ టెర్రరిజం అనే పదాన్ని కాంగ్రెస్ పెద్దలు తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.

Next Story