- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత వెనుక ఎవరున్నారో నాకు తెలుసు.. కాసేపట్లో అన్నీ చెబుతా: బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్(BRS) మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యవహారంపై తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యవహారంపై తెలంగాణ బీజేపీ కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. కవిత అంశంపై కాసేపట్లో అన్ని వివరాలు వెల్లడిస్తా అని అన్నారు. కవిత ఎందుకు అలా మాట్లాడున్నారో.. ఆమెతో ఎవరు అలా మాట్లాడిస్తున్నారో.. నాకు అన్ని తెలుసు.. కవిత వెనకాల ఉన్నది ఎవరో కూడా కాసేపట్లో వెల్లడిస్తా అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని అడ్డుకోలేరు.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ ఒక విఫల నాయకుడు అని విమర్శించారు. రాహుల్ గాంధీకి, ప్రధాని మోడీకి.. నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందని అన్నారు. రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే.. కనీసం నడవలేని స్థితిలో ఉన్న మల్లిఖార్జున ఖర్గేకు పగ్గాలు ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు పాకిస్తాన్‌పై యుద్ధం చేసి గెలిచారని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు.. యుద్ధం గెలిచాక పీవోకేను ఎందుకు భారత్‌లో కలపలేకపోయారని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దేశ ప్రజలే కాదు.. సైన్యం కూడా నమ్మదని అన్నారు.






