- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైనా డైలీ సీరియలా? రాష్ట్ర ప్రభుత్వంపై రఘునందన్ రావు ఘాటు విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ మానుకోవాలని ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ అయి ప్రజలను ఆగం చేస్తున్నాయని ఇందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నామమాత్రపు విచారణ చేపడుతున్నారని ఇందులో తప్పు చేసిన ఒకడిని అరెస్టు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ తో (Phone Tapping Case) సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను సిట్ (SIT) విచారణకు పిలుస్తోందని దుయ్యబట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను నా కుటుంబ సభ్యులను హరాస్మెంట్ చేశారు. ఈ విషయంలో నేను పదిసార్లు నాటి డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా నన్ను ఎందుకు పిలవడం లేదు? అని ప్రశ్నించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫిస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రొజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలను ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతూ టైమ్ పాస్ చేస్తున్నారని ఇదేనా గాంధీ భవన్, తెలంగాణ భవన్ పంచాయతీనా అని విమర్శించారు. ఇదేనా సిట్ అధికారులు చేస్తున్న దర్యాప్తు అని దుయ్యబట్టారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని అమెరికాలో ఉండగా ప్రభాకర్ రావు చెప్పారని అదే రాసుకుని రిమాండ్ చేయవచ్చుకదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పబ్లిసిటీ స్టంట్స్ మానండి:
అన్నపూర్ణ క్యాంటీన్లకు (Annapurna Canteen Name Change) ఇందిరమ్మ పేరు పెట్టడం దౌర్భంగం అని రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి చీకటి రోజులు తెచ్చిన ఇందిరా గాంధీ పేరు పథకాలకు పెట్టడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ 18 నెలల తన పాలనపై సమీక్షించుకోకుండా రోజుకొక్క కొత్త కథతో ముందుకు వస్తున్నదన్నారు. ఇకనైనా పేర్లు మార్చుడు, పబ్లిసిటీ స్టంట్లు మాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ దృష్టి పెట్టాల్సింది కుక్కల బెడద, సమస్యలపై కానీ పేర్ల మార్పు మీద కాదని పథకాల పేర్లు మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేయాలన్నారు. ప్రజల కనీస అవసరాలు, సౌకర్యాలు తీర్చకుండా పేర్లు మార్పులు ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను షేవ్ చేస్తూ బీజేపీ ప్రజలను సేవ్ చేస్తుందన్నారు. ఇవాళ బీజేపీ ఇచ్చిన భరోసా పిలుపుకు స్పందించి అనేక మంది విజ్ఞప్తులు ఇచ్చారని వాటన్నింటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.






