- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రఘునందన్, ఈటలకు హైకోర్టులో ఊరట
by Gantepaka Srikanth |
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్(Etela Rajender), రఘునందన్ రావు(Raghunandan Rao)లకు తెలంగాణ హైకోర్టు(TG High Court)లో ఊరట లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్(Etela Rajender), రఘునందన్ రావు(Raghunandan Rao)లకు తెలంగాణ హైకోర్టు(TG High Court)లో ఊరట లభించింది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని వీరిద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ కేసులను క్వాష్ చేయాలని వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా వారి పిటిషన్లను హైకోర్టు విచారణకు అనుమతించింది.
కాగా, కరోనా వ్యాప్తి సమయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు 40 కార్లు, 60 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారంటూ ఈటలపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా దుబ్బాకలో గాంధీ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించడంపై దుబ్బాక పోలీసులు రఘునందన్‌పై కేసు నమోదు చేశారు.
Next Story






