Raghunandan: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డొచ్చింది.. ఎంపీ రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఢిల్లీ (Delhi)లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కమలనాథులు అడుగులు చేస్తున్నారు.

Raghunandan: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డొచ్చింది.. ఎంపీ రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi)లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కమలనాథులు అడుగులు చేస్తున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) 12 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ దాదాపు 27 సంవత్సరాల తరువాత హస్తినలో బీజేపీ (BJP) పాగా వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 46 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక ఆమ్‌‌ఆద్మీ పార్టీ 24 నియోజకవర్గాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) స్పందించారు. కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్లుగా హస్తినలో తమ పార్టీ విజయం సాధించడానికి వంద కారణాలు ఉన్నాయి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకున్న ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న 12 ఏళ్లు భారీ ఎత్తున కుంభకోణాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సీఎం (CM), డిప్యూటీ సీఎం (Deputy CM), మంత్రులు (Ministers) కూడా స్కాంలలో భాగస్వాములు అవ్వఢంతోనే ఢిల్లీ జనం ఆప్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని కామెంట్ చేశారు.

పేద, బడుగు బలహీన వర్గాలకు మధ్య తరగతి జనం తోడు అవ్వడంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని కామెంట్ చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా.. కేవలం రాష్ట్ర పథకాలు అమలు చూస్తూ ఆప్ సర్కార్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఫలితంగా ఢిల్లీ ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యారనే ఫైర్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)కి గాడిద గుడ్డు వచ్చిందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీఆర్ఎస్‌ (BRS)కు గాడిద గుడ్డే వస్తుందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ (Pink Party) గల్లంతు అవ్వడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటీఫికేషన్ వెలువడినా.. ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోవడం దేనికి సంకేతమో ఆ పార్టీ నేతలే చెప్పాలని రఘునందర్ చురకలంటించారు.

Next Story