- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: సుప్రీంకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి రఘునందన్ రావు కీలక సలహా
తొందరపడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఏదో సాధిస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏమి సాధించలేకపోయిందని రఘునందన్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. తొందరపడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఏదో సాధిస్తాం అని చెప్పి ఏమి సాధించలేకపోయిందన్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు మరో మార్గం లేకుండా పోయిందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించిన నేపథ్యంలో ఇవాళ ఓ న్యూస్ చానల్ తో రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేకంటే ముందే అఖిలపక్షంతో, కేంద్ర ప్రభుత్వంలో చర్చించి ఎస్ఎస్‍పీ వేయాలని ఆలోచిస్తే బాగుండేదన్నారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు మొదటి నుంచి తడబడుతున్నాయని తప్పటడుగులు పడుతున్నాయని విమర్శించారు. దీని వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఇకనైనా న్యాయనిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో చర్చించి ముందడుగులు వేయాలని సూచించారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించమనే మీ మొండిపట్టుదల బీసీలకు మరింత అన్యాయం చేస్తుందన్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం ఇస్తారా లేక 56 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. అప్పుడు బంతి ఇతర పార్టీల కోర్టులోకి వెళ్తుందని అప్పుడు వారు పార్టీ పరంగా ఇస్తారా లేదా అనేది ప్రజలు గమనిస్తారన్నారు. ఇవేవి చేయకుండా కావాలనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని తీరా ఎన్నికలు నిర్వహించడానికి ముందు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మేమే చాంపియన్లమంటూ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్, ఎంపీడీసీల కోసం ఎవరో బీసీ నాయకులు ఆలోచిస్తున్నారని, ఆశపడుతున్నారని తాను అనుకోవడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో 10 శాతం మంత్రులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ వ్యక్తులకు జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉందని అనుకుంటామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించేప్పుడు అఖిలపక్ష పార్టీలను సంప్రదించి ఇచ్చారా హామీ ఇచ్చేప్పుడు కాంగ్రెస్ ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని అనడం ఏంటని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలో తప్పకుండా ఇవ్వబోతున్నదన్నారు. కొండా సురేఖ అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్ లో బీసీలకు ఏం జరుగుతోందో దేశమంతా చూస్తోందన్నారు.






