Raghanandan Rao: గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకుందాం.. కాంగ్రెస్ పై రఘునందన్ ఫైర్

by Prasad Jukanti |

అఖిలపక్ష సమావేశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు.

Raghanandan Rao: గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకుందాం.. కాంగ్రెస్ పై రఘునందన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం నుంచి సాధించాల్సిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై (All Party Meeting) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు. గల్లీలో కాదు ఢిల్లీలోనే ఈ విషయంపై తేల్చుదాం రావాలని అధికారపక్షానికి చాలెంజ్ చేశారు. షార్ట్ టైమ్ లో సమాచారం ఇచ్చి ఆల్ పార్టీ మీటింగ్ కు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మీ పంచాయితీ అంతా ఢిల్లీతోనే కదా.. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో అన్ని పార్టీల మీటింగ్ పెడదాం. అక్కడే ఎంపీలందరం కలిసి కేంద్ర మంత్రుల వద్దకు వెళ్దామన్నారు. తాజాగా ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ కంటే ఎక్కువ చిత్తశుద్ధి ఇంకెవరికి ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినా అడకపోయినా ఈ రాష్ట్రం కోసం పని చేసేది బీజేపీనే అన్నారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ దృష్టి ఎగ్గొట్టిన హామీల అమలుపై ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాను చేయాల్సిన పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్లపల్లిలో రూ.500 కోట్లతో రైల్వే టెర్మినల్ కడితే అక్కడ రూ. 5 కోట్లు పెట్టి రోడ్డు వేయడానికి రేవంత్ రెడ్డికి చేతకావడం లేదన్నారు.

కేసీఆర్, కేటీఆర్ అరెస్టుకు ఎందుకు భయం?

బీఆర్ఎస్ తో బీజేపీకి ఒప్పందం ఉందని గాలి మాటలు మాట్లాడటం కాదని అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా వాటిని నిరూపించాలని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ (KCR) తో బీజేపీకి ఒప్పందం ఉండే కవిత జైలుకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకే బీఆర్ఎస్ తో తో ఒప్పందం ఉందని అందుకే కేసీఆర్, కేటీఆర్ ను అరెస్టు చేయడం లేదన్నారు. వీరిని అరెస్టు చేయడంలో రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 14 నెలల మీ పాలనలో కాళేశ్వరం అవినీతిలో 14 పైసలు కూడా కేసీఆర్ నుంచి కక్కించారా? అని నిలదీశారు. ఫార్ములా- ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ (KTR) ను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కేటీఆర్ ను అరెస్టు చేస్తే మీ ప్రభుత్వం కూలుతుందని భయపడుతున్నారా? అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు మాత్రమే దేశం దాటిపోయారు. మిగతా వాళ్లంతా ఇక్కడే ఉన్నారు. గత ప్రభుత్వపెద్దలు చేప్పడం వల్లే ఫోన్ ట్యాపింగ్ చేశామని అరెస్టు అయిన పోలీసులు చెబుతుంటే గత ప్రభుత్వ పెద్ద అయిన కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో మీకు తెలియడం లేదా? అని మండిపడ్డారు.

Next Story