- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్స్పెక్టర్ పొలిటికల్ షార్ట్‌కట్.. పోలీస్ బాస్ మల్టీజోన్ షాట్..!
రాచకొండ పోలీసు కమిషనరేట్ లో గురువారం ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించిన

దిశ, సిటీ క్రైం : రాచకొండ పోలీసు కమిషనరేట్ లో గురువారం ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ సంఘటన రాచకొండ పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇన్ స్పెక్టర్ వ్యవహరం పోలీసుబాసునే తీవ్ర ఒత్తిడికి గురి చేసిందనే చర్చ సంచలనం రేపింది. ఓ పోలీసు ఠాణా ఇన్ స్పెక్టర్ అటాచ్ అయ్యారనే విషయం బయటికి పొక్కగానే నిమిషాల వ్యవధిలో ఆ ఠాణా పోస్టింగ్ కోసం రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన ఆ ఇన్స్పెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. ఇలా పోస్టింగ్ కోసం ఒత్తిడి తీసుకువచ్చిన ఆ ఇన్ స్పెక్టర్ ను పోలీసు బాస్ మల్టీజోన్ -1కు పంపించేశారని పోలీస్ వర్గాలు స్పష్టం చేసాయి.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా పోలీస్ బాస్ జారీ చేసారని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం రాచకొండ పోలీసు బాస్ ఉదయం మావోయిస్టు కీలక నేతలు లొంగుబాటు వ్యవహారంలో బిజీ బిజీగా ఉన్నారు. అంతకుముందు హెచ్ సిఏ గోల్ మాల్ కేసుకు సంబంధించిన నిందితుల అరెస్టు వ్యవహారంలో ఓ నిందితుడు పరారీకి సహకరించాడని ఉప్పల్ ఇన్ స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి పై ఆరోపణలు, అనుమానం ఉన్నట్లు సీఐడీ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీస్ బాస్ అతనిని ప్రాథమికంగా సీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ ఉప్పల్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వాలంటూ మరో ఇన్ స్పెక్టర్ పలువురు రాజకీయ ప్రముఖుల వద్దకు పరుగులు పెట్టి ఫోన్ లు చేయిస్తు ఇబ్బందిపెట్టారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ బాస్ ఆ ఇన్స్పెక్టర్ ను మల్టీజోన్ 1 కు సరెండర్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారని తేలింది. ఒక ఇన్ స్పెక్టర్ అటాచ్ అయిన ఉత్తర్వుల సమాచారం సీపీ కార్యాలయం దాటకముందే సదరు ఇన్ స్పెక్టర్ ఉప్పల్ పోస్టింగ్ కోసం రాజకీయ ప్రతినిధుల వద్ద వాలిపోయి పోలీసు బాసు పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసు వర్గాలు తప్పుపడుతున్నాయి. పోస్టింగ్ దక్కించుకునేందుకు ఇన్ స్పెక్టర్ లు ఇలా రాజకీయ నాయకుల వద్దకు చేరిపోయి పోలీసు బాసుల మీద ఒత్తిడి తీసుకువస్తున్న వైనం సరైంది కాదన్నారు.
ఇలా రాజకీయ నాయకుల దగ్గర సలాం.. కొట్టి పోస్టింగ్ ల కోసం పోలీసు ప్రతిష్టను దిగజార్చడమేనని పోలీసు వర్గాలు అంటున్నాయి. గతంలో అబ్దుల్లాపూర్ మెట్, ఎల్బీనగర్, ఎస్ఓటీ ఇంకా అనేక కీలకమైన పోలీసు స్టేషన్ లలో ఎస్ హచ్ఓ హోదా లో పని చేసిన ఈ ఇన్ స్పెక్టర్ తిరిగి ఉప్పల్ ఆశించడాన్ని తోటి ఇన్ స్పెక్టర్ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్ హెచ్ఓ చేయాలని అందరికీ ఆశ ఉంటుందని, ఇలా రాజకీయ ఒత్తిళ్లకు గురి చేసి ఇతరులకు అన్యాయం చేయొద్దని పోలీసు వర్గాల్లో విమర్శలు వెలు వెత్తుతున్నాయి. పోలీసు బాస్ తీసుకున్న నిర్ణయం పై పోలీసు వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.






