మెసేజ్ చివరలో T/S/P/G అక్షరాలు ఉన్నాయా? ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం: రాచకొండ పోలీస్

by Ramesh Naini |

పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.

మెసేజ్ చివరలో T/S/P/G అక్షరాలు ఉన్నాయా? ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం: రాచకొండ పోలీస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని (Cyber ​​criminals) సైబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాదాపు మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయని పోలీస్ నివేదికలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా.. స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఎక్స్ అధికారిక ఖాతా వేదికగా ఆసక్తికర అవగాహన వీడియో షేర్ చేశారు. వీడియో లో చూపించిన ప్రకారం.. సైబర్ నేరాలు కొంత రూపంలో వస్తున్నాయని తెలిపారు. మీ ఫోన్‌కి మెసేజ్ వచ్చిందా? వచ్చిన ఎస్ఎంఎస్ చివరలో చివరలో T/S/P/G ఉంటే.. అది నిజముదే అని నమ్మకండి.. అని సూచించారు.

TRAI వారు చెప్పినట్లు T- ట్రాన్సాక్షన్, S-సర్వీస్, P-ప్రమోషనల్, G-గవర్నమెంట్ అని.. ఇవి చూడగానే అసలైనవిగా ఉంటాయని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఎందుకంటే సైబర్ మోసగాళ్లు కూడా అసలైన సంస్థలు, కంపెనీల పేర్లతో తప్పుదారి పట్టిస్తున్నారని వెల్లడించారు. ఇది సైబర్ మోసం కావొచ్చు.. తెలియని లింక్ ఉందేమో గమనించాలని, లేదంటే ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం అవుతుందని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండండి.. ప్రతి మెసేజ్‌ను ఓపెన్ చేయకముందు ఆలోచించాలని సూచించారు.

అసలైన బ్యాంకులు లింక్‌లు (Bank link) ఎప్పుడూ షేర్ చేయవని, వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ అడగరని వెల్లడించారు. అనుమానాస్పద మెసేజ్ అయితే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మీ రక్షణకై.. రాచకొండ పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని భరోసా ఇచ్చారు. జాగ్రత్తగా ఉండండి.. మోసాలకు గురికాకవొద్దని ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.

Next Story