- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kidney Racket Case : కిడ్నీ రాకెట్ కేసును చేధించిన రాచకొండ పోలీసులు
ఆలకనంద ఆసుపత్రి(Alaknanda Hospital)లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్(Kidney Racket Case)కు సంబంధించిన కేసును రాచకొండ పోలీసు(Rachakonda police)లు చేధించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆలకనంద ఆసుపత్రి(Alaknanda Hospital)లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్(Kidney Racket Case)కు సంబంధించిన కేసును రాచకొండ పోలీసు(Rachakonda police)లు చేధించారు. అలకనంద ఆసుపత్రి నిర్వాహకుడితో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి దందా సాగిన తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసు అధికారులు మరికొద్ధి సేపట్లో మీడియాకు వివరించనున్నారు.
కాగా హైదరాబాద్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జరిగిన కిడ్నీ మార్పిడి దందాపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని, ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తును ఆదేశించారు. అలకనంద హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందని తెలిపారు. అత్యంత నిరుపేదల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారని వెల్లడించారు. అలకనంద హాస్పిటల్‌ను సీజ్ చేశామని, ఆస్పత్రి యజమానిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రికి వివరించారు.
నిందితుల రిమాండ్
అలకనంద ఆస్పత్రి యజమాని సుమంత్, రిసెప్షనిస్ట్ గోపీలను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి జడ్జీ ముందు హాజరుపరచగా చర్లపల్లి జైలుకు ఇప్పటికే రిమాండ్ చేశారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటకకు చెందిన బ్రోకర్లు, వైద్య సిబ్బంది ప్రమేయం కిడ్నీ దందాలో ఉందని తెలుస్తోంది. కిడ్నీ రాకెట్ లో ఓ వైద్యుడు పోలీసులకు చిక్కకుండా కశ్మీర్‌కు పారిపోయినట్లుగా గుర్తించారు. కేసులో కేరళతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల పరిధిలో కిడ్నీ దందాలపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్రలపై ఆరాతీస్తున్నారు. కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను రిమాండ్ కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు.






