Rachakonda CP: మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు

by Gantepaka Srikanth |

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) నోటీసులు జారీ చేశారు.

Rachakonda CP: మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని ఆదేశించారు. అంతేకాదు.. గన్(Gun) సరెండ్ చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. తన కూతుర్ని చూడనివ్వడం లేదని మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటికి దగ్గరకు తీసుకెళ్లగా.. మోహన్ బాబు ఆగ్రహంతో మీడియాపై దాడి చేసి.. విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఈ దాడిలో పలువురు జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో రాచకొండ పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు.

Next Story