R Krishnaiah: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాల్సిందే.. ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-12 07:19:43  IST  )

ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ (Kamareddy BC Declaration)లో భాగంగా రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ 42 శాతానికి పెంచుతామని ప్రకటించిందని.. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (Rajya Sabha MP R.Krishnaiah) డిమాండ్ చేశారు.

R Krishnaiah: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాల్సిందే.. ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ (Kamareddy BC Declaration)లో భాగంగా రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ 42 శాతానికి పెంచుతామని ప్రకటించిందని.. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (Rajya Sabha MP R.Krishnaiah) డిమాండ్ చేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్‌ (Diversion Politics) చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా అగ్ర కులాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు సీలింగ్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఎత్తివేసిందని, ఇప్పుడు ఏ సీలింగ్‌ లేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని సీఎం ప్రకటించడం బీసీలను నిలువునా మోసం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని లేని పక్షంలో బీసీ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

Next Story