‘భయపడాల్సిన పనేం లేదు.. ధైర్యంగా ఉండండి’.. BC రిజర్వేషన్లపై ఆర్.కృష్ణయ్య కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీసీ రిజర్వేషన్లపై తుది విచారణ ప్రారంభమైన వేళ బీసీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘భయపడాల్సిన పనేం లేదు.. ధైర్యంగా ఉండండి’.. BC రిజర్వేషన్లపై ఆర్.కృష్ణయ్య కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీసీ రిజర్వేషన్లపై తుది విచారణ ప్రారంభమైన వేళ బీసీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) విషయంలో భయపడాల్సిన పనేం లేదు.. అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. కొంతమంది కావాలనే బీసీలను కన్‌ఫ్యూ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీసీల జనాభా 60 శాతం ఉందని చెప్పారు. హైకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వం తరపున 42 శాతం రిజర్వేషన్లపై బలమైన వాదనలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మేమెంతో.. మాకంత.. జనాభా ప్రకారం వాటా దక్కాల్సిందే అని స్పష్టం చేశారు. దీనిపై అవసరమైన సుప్రీంకోర్టులోనూ న్యాయం పోరాటం చేస్తామని ప్రకటించారు. మరోవైపు.. బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందని.. సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని.. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే.. ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Next Story