- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
R. Krishnaiah: పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే యుద్ధమే.. ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు
పార్టీ పరంగా రిజర్వేషన్లు వద్దని, చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ పరంగా రిజర్వేషన్లు వద్దని, చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం బీసీల హక్కుల కోసం న్యాయసాధన దీక్షలో భాగంగా, ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌లోని ఇంద్ర పార్క్ వద్ద దీక్ష నిర్వహించారు. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తామంటే చూస్తూ ఊరుకోమని, మా తడాఖా చూపిస్తామని ఫైర్ అయ్యారు. పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్లడం తప్పించుకునే ఉపాయమని, పార్టీ పరంగా ఇవ్వొద్దని గతంలో చెప్పినట్లు గుర్తుకుచేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే చాలా వివాదాలు వస్తాయని తెలిపారు. మాకు భిక్షం వద్దు.. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.






