- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరు.. రాళ్లతో కొట్టిస్తాం: ఆర్ కృష్ణయ్య మాస్ వార్నింగ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుట్ర చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Fee reimbursement) ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కుట్ర చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ చదువుకోకూడదనే దురుద్దేశంతోనే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించకపోతే.. మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని, రాళ్లతోని కొట్టిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు.. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వందల సార్లు ధర్నాలు, పోరాటాలు చేసినట్లు గుర్తుకు చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేద విద్యార్థులకు న్యాయం జరగాలని రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చారని వివరించారు. కానీ నేటి ముఖ్యమంత్రి ఓర్వలేకపోతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవా? నాలుగైదు వేల కోట్లు ఉన్న బకాయిలను పన్నెండు కోట్లకు తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతి పక్షాలు ఇటీవల అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వాకౌట్ చేయలేదని మండిపడ్డారు.






