- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
R Krishnaiah: ఆ పని చేయకపోతే రేవంత్ చిట్టా విప్పుతాం.. ఆర్ కృష్ణయ్య హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచకపోతే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిట్టా విప్పుతామని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీసీ(BC) వ్యతిరేకిగా మారారని కామెంట్ చేశారు. బీసీలను అణిచివేసేందుకు కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కుట్రలు చేస్తోందని పన్నిందని మండిపడ్డారు. బీసీ (BC) జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేపట్టిన కుల గణన తప్పుల తడకగా ఉందని విమర్శించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కులగణన (Cast Census)లో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని.. ఈ పరిణామం బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్ర అని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు చట్టబద్ధత కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని గుర్తు చేశారు. కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ (Assembly) వేదికగా సీఎం చట్టబద్ధతతో పని లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీలు (BJP) సైతం 42 శాతం బీసీలకు టికెట్లు కేటాయిస్తారా.. అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్‌ను ప్రతిపక్షాలు స్వీకరిస్తాయా.. బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందా? అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్.కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.