జీవో 46 రద్దు చేయాల్సిందే : ఆర్. కృష్ణయ్య డిమాండ్

by Muthe.Rajitha |

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన జీవో 46ను (GO No. 46) వెంటనే రద్దు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

జీవో 46 రద్దు చేయాల్సిందే : ఆర్. కృష్ణయ్య డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన జీవో 46ను (GO Ms. No. 46) వెంటనే రద్దు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవో 46ను ఇటీవల పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ శాఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. బీసీల రిజర్వేషన్‌ను 42% నుంచి 22%కి (కొన్ని ప్రాంతాల్లో 17%) తగ్గించి.. SC/ST/BC అందరికి కలిపి 50% మించకూడదని జీవోలో పేర్కొంది. దీనిని ప్రభుత్వం బీసీలకు చేసిన మోసంగా కృష్ణయ్య అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు బిసిలకు చేసిన హామీ మరిచి పోయారని తీవ్రంగా మండిపడ్డారు.

ఈ జీవో వల్ల సుమారు 1,200 సర్పంచ్ పోస్టులు బీసీల చేతిలోంచి వెళ్లిపోతాయని, ఇది బీసీల రాజకీయ భవిష్యత్తుకు "గొడ్డలిపెట్టు"లా ఉందని అన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఈ జీవో జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయం అన్నారు.

Next Story