- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత దీక్షతో బీసీ ఉద్యమం బలోపేతమైంది: ఆర్. కృష్ణయ్య
బీసీల స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరాహార దీక్షకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. రాజ్యాంగంలోని 243 డీ6 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే, రిజర్వేషన్లు నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే, సీఎం రేవంత్ రెడ్డికే ఉన్నప్పటికీ ఆయన ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కృష్ణయ్య విమర్శించారు. ఆర్డినెన్స్‌పై ఇంతవరకు గవర్నర్‌ను కలువలేదని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా, ప్రతిపక్షాలపై, బీజేపీపై, ఇతర నాయకులపై బురద జల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని కృష్ణయ్య ఆరోపించారు. గ్లోబల్ ప్రచారం, డైవర్ట్ పాలిటిక్స్‌కు బదులుగా బీసీలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి పని చేయాలని సూచించారు. ఇప్పటివరకు మేధావుల, అఖిలపక్ష సమావేశం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై, ఇతర పార్టీలపై బురద జల్లుతూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని విమర్శించారు.
కవిత దీక్షతో బీసీ ఉద్యమం బలోపేతం:
ఎమ్మెల్సీ కవిత నిస్వార్థంగా బీసీల కోసం దీక్ష చేస్తుందని ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు. ఆమె దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 40, 50 సంవత్సరాలుగా బీసీల కోసం తాను 12 వేలకు పైగా ఉద్యమాలు చేశానని గుర్తు చేసుకున్నారు. బీసీల కోసం కవిత చేస్తున్న ఉద్యమం బీసీల పట్ల మరింత బలాన్ని చేకూరుస్తుందని, ఎటువంటి సందేహం లేదని కృష్ణయ్య పేర్కొన్నారు. కవితను మనసారా అభినందిస్తున్నానని, ఆమె పట్టుదలతో దీక్ష చేస్తుందని, ఆమె దీక్ష జయప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నానని ఆర్. కృష్ణయ్య తెలిపారు.






