- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Attack: తీన్మార్ మల్లన్నను చంపేందుకే వచ్చారు.. దాడిపై క్యూ న్యూస్ సిబ్బంది కీలక విషయాలు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న (Q News) క్యూ న్యూస్ ఆఫీస్‌పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వారు క్యూ న్యూస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి వారిపై దాడికి యత్నించారు. ఇది కాస్తా ఉద్రిక్తతకు దారి తీయగా ఎమ్మెల్సీ మల్లన్న గన్‌మెన్‌లు గాల్లోకి 5 రౌండ్లు ఫైరింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరికి గాయాలైనట్టు సమాచారం. ఆఫీసులో రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా జహీరాబాద్ పర్యటనలో నిన్న తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
రంగంలోకి పోలీసులు..
మల్లన్న టీమ్ ఇద్దరు జాగృతి కార్యకర్తలను పట్టుకున్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పోలీసులు పంపించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ గోవింద్‌రెడ్డి వెల్లడించారు. సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. కవిత బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పు పట్టినందుకే దాడికి దిగినట్లు తెలుస్తోంది. జవహర్‌నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగినట్లు మల్లన్న టీమ్ భావిస్తోంది.
తీన్మార్ మల్లన్నను చంపేందుకే వచ్చారు: క్యూ న్యూస్ సిబ్బంది
జాగృతి కార్యకర్తలు తీన్మార్ మలన్నను చంపేందుకు వచ్చారని క్యూ న్యూస్ సిబ్బంది ఆరోపించారు. మల్లన్న గనమెన్‌పై దాడి చేసి ఆఫీస్‌లో ఎవరు కనబడితే వారిని కొట్టారని, అందుకే గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారని సిబ్బంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మల్లన్న పైన కూడా దాడి చేసినట్లు ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్సీ కవితపై మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని, ఈ సంఘటనకు కారకులైన జాగృతి కార్యకర్తలపై కేసులు పెట్టాలని క్యూ న్యూస్ సిబ్బంది డిమాండ్ చేశారు.






