Punna Kailash: నల్లగొండ ప్రజలు మూసీ విషజలాల్లో మగ్గాల్సిందేనా?

by Gantepaka Srikanth |

తామేమి పాపం చేశామని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు జీవితాంతం మూసీ విషతుల్యాల్లో మగ్గాల్సిందేనా? ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో చనిపోతుంటే హరీష్ రావు, కేటీఆర్‌లు ఎందుకు అడ్డుకుంటున్నారని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్​నేత ప్రశ్నించారు.

Punna Kailash: నల్లగొండ ప్రజలు మూసీ విషజలాల్లో మగ్గాల్సిందేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తామేమి పాపం చేశామని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు జీవితాంతం మూసీ విషతుల్యాల్లో మగ్గాల్సిందేనా? ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో చనిపోతుంటే హరీష్ రావు, కేటీఆర్‌లు ఎందుకు అడ్డుకుంటున్నారని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్​నేత ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి అని, నల్లగొండ ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో అల్లాడుతుంటే కేటీఆర్ తన ప్రకటనలతో నల్లగొండ జిల్లాలో ఉన్న 45 లక్షల మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం పున్న కైలాష్ నేత గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ అడుగులకు హరీష్ రావు మడుగుల ఒత్తుతున్నారని, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న మోసగాళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాను అంధకారంలో నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మా నల్లగొండ జిల్లా పేరు చెప్పి రాష్ట్రం అంతా ఓట్లు అడగడానికి సిగ్గు లేదా? మూసీ మురుగు నీటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు విషజలాల్లో చిక్కుకొని అల్లాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి మూసీ విషపూరిత జలాల నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారని కైలాష్ నేత చెప్పారు. సీఎం రైతుల కోసం చేస్తున్న ఈ శుద్ధి కార్యక్రమానికి తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన చెప్పారు.

Next Story