Ponnam: టీజీ ఆర్టీసీలో 99వ బస్ డిపోకు నేడు శంకుస్థాపన.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

by Prasad Jukanti |

ఆర్టీసీపై మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ponnam: టీజీ ఆర్టీసీలో 99వ బస్ డిపోకు నేడు శంకుస్థాపన.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజా రవాణాను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. అందులో భాగంగా కొత్త బస్సులు, కొత్త డిపోలు, కొత్త బస్ స్టేషన్ ల అభివృద్ధి, కొత్త నియామకాలు చేపడుతోందని తెలిపారు. ఇవాళ ములుగు (Muluga) జిల్లా ఏటూరు నాగారంలో ఆర్టీసీ బస్సు డీపోకు (Eturu Nagaram Bus Depot) మంత్రి సీతక్క (Seethakka) శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, మంత్రి సీతక్కకు పొన్నం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ బస్సు డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఛత్తీస్ గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లోని ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయన్నారు. కాగా ఇటీవల పెద్దపల్లి, ములుగు కు రెండు బస్ డిపోలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 4.5 కోట్లతో ఆర్టీసీలో 99వ డిపోగా ఏటూరునాగారం డిపోకు ఇవాళ మంత్రి సీతక్క శంకుస్థాపన చేయబోతున్నారు.

Next Story