- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణ రక్షణ సేన’ రిజిస్ట్రేషన్‌కు బహిరంగ నోటీసు.. అభ్యంతరాలు ఉంటే తెలపాలన్న ఈసీ
'తెలంగాణ రక్షణ సేన' పేరుతో కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె తన భర్త అనిల్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం (EC) తాజాగా బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త ప్రాంతీయ పార్టీకి అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత, జనరల్ సెక్రటరీగా దేవనపల్లి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రూప్ సింగ్ లకావత్, కోశాధికారిగా డా.అరుణ్ కుమార్ నియమితులయ్యారు.
జూన్ 1లోగా అభ్యంతరాల గడువు..
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈ బహిరంగ నోటీసును జారీ చేశారు. ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఎవరికైనా, ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే వాటిని జూన్ 1 లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఈసీ పార్టీ రిజిస్ట్రేషన్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది.






