- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ డిక్లరేషన్ ప్రకటించిన చోటే భారీ బహిరంగ సభ.. మాజీ మంత్రి తలసాని కీలక ప్రకటన
విద్యార్థుల చదువు విషయంలో ప్రభుత్వానికి చిన్నచూపు ఉన్నదని.. ఇక నుంచి ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచుతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల చదువు విషయంలో ప్రభుత్వానికి చిన్నచూపు ఉన్నదని.. ఇక నుంచి ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచుతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. యువ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో చలో సరూర్‌నగర్ కార్యక్రమం చేపడతామని.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరిట ఎన్నో హామీలు ఇచ్చిందని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ కోసం రెండున్నరేళ్లుగా యువత ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో విద్యార్థులు రోడ్లపైకి వస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజన నేతలతో సమావేశం నిర్వహిస్తామని.. అనంతరం సభపై చర్చిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందని.. తాగడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. త్వరలోనే తాగు నీటి విషయంలోనూ బీఆర్ఎస్ తరఫున కార్యాచరణ తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదన్నారు. విద్యార్థుల తరఫున పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా వైఎస్సార్, కేసీఆర్ పేర్లు చెరిపేయాలని రేవంత్ అనుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





