- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓపెన్ ప్లాట్స్ కొనాలని చూస్తున్నారా?.. వేలానికి ముహూర్తం ఖరారు
by Gantepaka Srikanth |
రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లోని రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియను ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లోని రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియను ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. ముందు నిర్దేశించిన ప్రకారం ఈ బహిరంగ వేలం ప్రక్రియను 6న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ వంద ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి గత నెలలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 240 మంది కొనుగోలుదారులు వేలం ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి చూపారు. 10వ తేదీన పెద్ద అంబర్‌పేటలోని అవికాగ్రాండ్‌లో వేలంపాట ఉంటుందని తెలిపారు.
Next Story






