- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్
నిజాంల రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నిజాంల రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద ప్రజాపాలన వేడుకలు జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్, చైర్మన్ గుత్తా సుఖేందర్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేశారు. మరోవైపు శాసన మండలిలోనూ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ జాతీయ జెండా ఆవిష్కరించి.. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
"రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజు నేడు. సువిశాల భారతావనిలో తెలంగాణ అంతర్భాగమైన రోజును పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు." అని తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ లో పోస్టు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.






