సింగరేణి లో త్వరలో పీఆర్​పీ చెల్లింపు

by Muthe.Rajitha |

సింగరేణి సంస్థలో పని చేస్తున్న అధికారులకు త్వరలోనే పర్ఫార్మెన్స్​ రిలేటెడ్​పే (పీఆర్​పీ ) చెల్లించనున్నట్లు కనీస వేతన సలహా మండలి ఛైర్మన్​, ఐఎన్​టియూసీ సెక్రటరీ జనరల్​జనక్​ప్రసాద్​సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సింగరేణి లో త్వరలో పీఆర్​పీ చెల్లింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో పని చేస్తున్న అధికారులకు త్వరలోనే పర్ఫార్మెన్స్​ రిలేటెడ్​పే (పీఆర్​పీ ) చెల్లించనున్నట్లు కనీస వేతన సలహా మండలి ఛైర్మన్​, ఐఎన్​టియూసీ సెక్రటరీ జనరల్​జనక్​ప్రసాద్​సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సంబంధిత ఫైలు తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వద్దకు చేరిందన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం మాత్రమే కాకుండా సింగరేణి అధికారుల సమస్యలపై ముందుకు వెళ్తున్నానని ఛైర్మన్​జనక్​ప్రసాద్​తెలిపారు. సింగరేణి అధికారులకు సంబంధించిన పిఆర్​పీ చెల్లింపునకు అవసరమైన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇందుకు సహకరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి అభినందనలు తెలియజేసినట్లు జనక్​ప్రసాద్​ఆ ప్రకటనలో తెలిపారు.

Next Story