- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల కల్పించండి : ట్రెసా
ప్రభుత్వం రెవెన్యూ శాఖ పునర్వైభవంలో భాగంగా జీపీవో, సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) కొనియాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం రెవెన్యూ శాఖ పునర్వైభవంలో భాగంగా జీపీవో, సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) కొనియాడింది. కొద్ది రోజుల్లోనే 33 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు/అదనపు కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా రెవెన్యూ ఉద్యోగుల మనస్సులను గెలుచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ట్రెసా నాయకులు ధన్యవాదాలు తెలిపారు. శనివారం మంత్రి పొంగులేటిని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్ ల నాయకత్వంలో పలువురు కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఐతే ప్రమోషన్ల ప్రక్రియను కింది స్థాయి వరకు కొనసాగించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మస్థైర్యం పెరుగుతుందని మంత్రిని కోరారు. వెంటనే డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా, తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాన్నారు.
ఇటీవల ప్రమోషన్ల వల్ల ఏర్పడిన 33 ఖాళీలను, 16 క్లియర్ వెకెన్సీస్, రెండేండ్లుగా రిటైరైన, డిసెంబర్ లోపు రిటైరవుతున్న 35 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు/డిప్యూటీ కలెక్టర్ల ఖాళీలను, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన దాదాపు 40 కి పైగా కాన్సెంట్/రిక్వయిర్మెంట్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే ఖాళీగా ఉన్న 28 జిల్లా రెవెన్యూ అధికారి పోస్టుల భర్తీ చేయాలన్నారు. ఈ సందర్భంగా 2010-11 & 2011-12 ప్యానెల్ ఇయర్ తహశీల్దార్లు 12 సంవత్సరాల పైబడి ప్రమోషన్లు లేకుండా ఉన్నారని, వీలైనంత త్వరగా ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలన్నారు.






