నిరూపించూ.. ముక్కు నేలకు రాస్తా: ఎంపీ ఈటలకు పాడి కౌశిక్‌రెడ్డి సవాల్

by Kema Shiva Kumar |

తెలంగాణ బీజేపీ (BJP)లో ఇంటర్నల్ వార్ తారా స్థాయికి చేరింది.

నిరూపించూ.. ముక్కు నేలకు రాస్తా: ఎంపీ ఈటలకు పాడి కౌశిక్‌రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ (BJP)లో ఇంటర్నల్ వార్ తారా స్థాయికి చేరింది. పార్టీలో వరుస పంచాయితీలు హైకమాండ్‌‌కు తలనొప్పుడు తెచ్చి పెడుతున్నాయి. ఓ వైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మధ్య గొడవ సద్దుమణగడంతో.. మరో లొల్లి తెర మీదకు వచ్చింది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender), కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అసలే స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఈ గొడవలేంటని ముఖ్య నాయకులు, కేడార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరా‌బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy), ఎంపీ ఈటల రాజేందర్‌‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌తో పాటు హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కుట్రలు చేస్తూ మోసం ఆరోపించారు. రేపటి రోజు కూడా బీజేపీని కూడా ఎలా మోసం చేస్తాడో బయటపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తాను ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఈటలను ఆహ్వానించినా అహంకారంతో హాజరుకాక.. నేడు పిలువలేదని తనపై అభాండాలు వేయడం సరికాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల సమయంలో శిలా ఫలాకాలపై నాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈటల పేరు లేకపోతే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఏది పడితే అది.. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమని, తాము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చొలేదని కౌశిక్ రెడ్డి అన్నారు.

Next Story