TG: నేపాల్ లో చిక్కుకున్నవారి కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్

by Prasad Jukanti |

నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

TG: నేపాల్ లో చిక్కుకున్నవారి కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల (Nepal protests) వేళ తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. అక్కడ చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ (Helpline) ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా నేపాల్ లో చిక్కుకుపోతే ఇక్కడికి సంప్రదించడం ద్వారా సహాయం అందించనున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. వందన: రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ +91 9871999044, జి.రక్షిత్ నాయక్: లైజన్ ఆఫీసర్. +91 9643723157, సిహెచ్. చక్రవర్తి: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ +91 9949351270 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించింది. తెలంగాణ పౌరులకు నేపాల్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.

Next Story